బతుకు భారమైన వలస కూలీలు.. కాలినడకన ఇంటిబాట పట్టారు. పిల్లా పాపలతో నెత్తిన మూట పెట్టుకుని, రోడ్డు పట్టుకుని నడక సాగిస్తున్నారు. అలా హైదరాబాద్ నుంచి కొంతమంది వలస జీవులు ఒడిశాకు పయనమయ్యారు. నిన్న రాత్రి షాద్నగర్ దగ్గర ఉండే.. కొల్లూరు నుంచి బయలుదేరారు. ఉదయం అయ్యేసరికి అబ్దుల్లాపూర్మెట్టు వరకూ చేరుకున్నారు. వారితోపాటు పది మంది పిల్లాలు నడుస్తున్నారు. ఇలా ఎంత దూరం అని వాళ్లను అడిగితే.. మాకు కూడా తెలీదు అని.. హైదరాబాద్ నుంచి భద్రాచలం 285 కిలోమీటర్లు అని తెలుసంతే.. అని సమాధామిచ్చారు.
వలస జీవి.. 'నడక' యాతన - వలస కూలీలపై కరోనా ప్రభావం న్యూస్
వలస కూలీల 'నడక' యాతన ఆగట్లేదు. కాళ్లు... నొప్పెడుతున్నా.. మనసు వెళ్లాలని తపిస్తోంది. అలా వందల కిలోమీటర్లు.. నడుస్తున్నారు. ఎలాగైనా ఇంటికి చేరాలని... చంటిపిల్లలను ఎత్తుకుని.. హైదరాబాద్ నుంచి.. ఒడిశాకు పయనమయ్యారు కొంతమంది వలస జీవులు.
వలస జీవి.. 'నడక' యాతన