రాష్ట్రంలో సూక్ష్మసేద్య ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. మొత్తం 1,256 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందుల బ్రాంచ్ కెనాల్ నుంచి మైక్రో ఇరిగేషన్ వ్యవస్థ కోసం రూ. 470 కోట్ల వినియోగానికి నిధుల మంజూరు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ నుంచి సూక్ష్మ సేద్యం కోసం రూ. 419 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చారు. గండికోట ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద సూక్ష్మసేద్య వ్యవస్థ ఏర్పాటుకు రూ. 367 కోట్లకు జలవనరుల శాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం 1.22 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సూక్ష్మసేద్య ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ పరిపాలనా అనుమతులు - సూక్ష్మసేద్య ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వ నిధులు
రాష్ట్రంలో సూక్ష్మసేద్య ప్రాజెక్టుల నిర్మాణానికి 1,256 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1.22 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ మెుత్తాన్ని వెచ్చిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
![సూక్ష్మసేద్య ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ పరిపాలనా అనుమతులు సూక్ష్మసేద్య ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ పరిపాలనా అనుమతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9677918-860-9677918-1606405700216.jpg)
సూక్ష్మసేద్య ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ పరిపాలనా అనుమతులు