బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఉంది. గురువారం సాయంత్రం నాటికి అల్పపీడన తీవ్రత తగ్గనుంది. ఆ తరువాత తెలంగాణపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తూర్పు - పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం మీదుగా వెళ్తోంది.
నేడూ, రేపూ భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా... నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. గురువారం సాయంత్రం తర్వాత తీవ్రత తగ్గనున్నట్టు వెల్లడించారు.
నేడూ, రేపూ భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఘన్‌పూర్ (వనపర్తి జిల్లా)లో 6.3, సర్వాయిపేట (జయశంకర్ భూపాలపల్లి)లో 6.3, ఆరుట్ల (రంగారెడ్డి)లో 5.6, గుండాల (యాదాద్రి)లో 5.5, దమ్మాయిగూడ (మేడ్చల్)లో 5, హైదరాబాద్ శివారులోని సింగపూర్ టౌన్‌షిప్‌లో 3.5, హయత్‌నగర్‌లో 3.1, పీర్జాదిగూడలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.