తెలంగాణ రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వడంపై సీఎం కేసీఆర్కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. వేలాదిమంది దినసరి కార్మికుల బతుకుదెరువును దృష్టిలో పెట్టుకొని సత్వరమే అనుమతులు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. విధి విధానాలు రూపొందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు.
సినీ పరిశ్రమ బాధను అర్థం చేసుకొని చిత్రీకరణలకు అనుమతి ఇవ్వడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యదావాలు తెలిపారు. క్లిష్ట సమయంలో తమ అభ్యర్థనలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. మళ్లీ పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.