ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ - meeseva functions transfer to gvwv

మీ-సేవ విభాగానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మీ సేవ విధులను గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల సిబ్బంది నిర్వహించనున్నారు. ఈమేరకు విధులు-నిధులను గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల విభాగానికి బదిలీ చేస్తూ... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ
మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ

By

Published : Jun 16, 2020, 2:54 PM IST

Updated : Jun 16, 2020, 3:35 PM IST

మీ-సేవ విభాగానికి సంబంధించిన విధులు-నిధులను గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల విభాగానికి ఉన్నతస్థాయిలో రెండు కేడర్ పోస్టులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్తగా ఏర్పాటు అయిన ఈ విభాగానికి ముఖ్యకార్యదర్శి, కమిషనర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. హెచ్ఓడీ కార్యాలయంలో 70 పోస్టులు కేటాయించారు. అలాగే పౌరసేవలను అందించటంలో కీలకంగా మారిన గ్రామ, వార్డు సచివాలయాలకు మీసేవ నుంచి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మీ-సేవకు కేటాయించిన బడ్జెట్ కూడా గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ ఖర్చు కింద 57 కోట్లు, సిబ్బంది జీతాల ఖర్చు కింద 3.61 కోట్లను ఖర్చు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అందే స్పందన ఫిర్యాదులు, 544 సేవలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు డిప్యూటీ డైరెక్టర్ హోదాకు తగ్గకుండా అధికారులను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:బడ్జెట్ 2020 - 21 ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి

Last Updated : Jun 16, 2020, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details