ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుప్రీం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సైనిక ఆస్పత్రిలోనే రఘురామకృష్ణరాజు - ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి వార్తలు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సైనిక ఆస్పత్రి వైద్య పరీక్షలపై ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల నివేదికను అధికారులు సీల్డు కవర్‌లో రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా సర్వోన్నత న్యాయస్థానానికి అందజేయనున్నారు.

ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి
ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి

By

Published : May 18, 2021, 9:34 PM IST

Updated : May 18, 2021, 10:53 PM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రిలో అధికారులు వైద్య పరీక్షలను నిర్వహించారు. ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం ఆయనకు మెడికల్ పరీక్షలను పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిర్వహణను వీడియోలో చిత్రీకరించారు. సైనిక ఆస్పత్రి వైద్య పరీక్షలపై ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల నివేదికను సీల్డు కవర్‌లో రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా సర్వోన్నత ధర్మాసనానికి అందజేయనున్నారు.

మంగళవారం మధ్యాహ్నం సమయంలో రఘురామ కుమారుడు భరత్‌ సికింద్రాబాద్​లోని మిలటరీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అధికారులు ఆయనను లోనికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. ప్రస్తుతం ఎంపీ మిలటరీ ఆసుపత్రిలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్ర హైకోర్టు.. జ్యుడీషియల్‌ అధికారిని నియమించింది. రిజిస్ట్రార్‌ నాగార్జున జ్యుడీషియల్‌ అధికారిగా వ్యవహరించారు. సుప్రీం తదుపరి ఆదేశాల వరకు రఘురామ సైనిక ఆస్పత్రిలో ఉండనున్నారు.

Last Updated : May 18, 2021, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details