రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో వైద్యాధికారులు పడకల సంఖ్య పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 117 ఆస్పత్రుల్లో 2,136 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 597 పడకల్లో బాధితులుండగా.. 1,539 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రెండు మంచాలు ఉండే గదులు మొత్తం 9,544 ఉండగా.. వాటిలో 6,756 పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సాధారణ వార్డుల్లో మొత్తం 4,442 పడకలు ఉండగా వాటిలో 3,130 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు..చర్యలు చేపట్టిన అధికారులు
కరోనా కేసుల ఉద్ధృతి కారణంగా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు టీకా ప్రక్రియను చేపడుతున్నారు.
కరోనా కేసుల పెరుగుదలతో అధికారుల ప్రత్యేక చర్యలు