ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలి'

By

Published : May 8, 2021, 5:48 PM IST

రేషన్ పంపిణీ విధానంలో లోపాలను గుర్తించి... డీలర్లపైన ఒత్తిడి లేకుండా చూడాలని ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు కోరారు.

Ration door delivery
Ration door delivery

రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానంలో లోపాలను సరిచేసి డీలర్లపైన ఒత్తిడి లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు కోరారు. ఏపీలో సగం మంది ఎండీయీలు రేషన్ పంపిణీ చేయడం లేదన్నారు.

డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి.... లోపాలను ముఖ్యమంత్రి గుర్తించాలని కోరారు. ఈ విధానం వల్ల ఎండీయూలు చేయవలసిన పంపిణీని డీలర్లు చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సిన్స్ వేయించాలని, బీమా సౌకర్యం కల్పించాలని చెప్పారు. రేషన్ డీలర్లపై అధికారుల వైఖరికి నిరసనగా.. మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్‌ చేయనున్నట్లు మండాది వెంకట్రావు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details