Kukatpally fire accident: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. మంటల ధాటికి థియేటర్‌లో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నికీలల ధాటికి థియేటర్ పైకప్పు కుప్పకూలింది. ప్రమాద సమయంలోఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Kukatpally fire accident: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. థియేటర్ పూర్తిగా దగ్ధం - తెలంగాణ వార్తలు
Kukatpally fire accident : హైదరాబాద్ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్బీలోని శివపార్వతి థియేటర్‌లో మంటలు చెలరేగి... సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి... మంటలను ఆర్పివేశారు.

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. థియేటర్ పూర్తిగా దగ్ధం
థియేటర్‌లో మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు... అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది... మూడు అగ్నిమాపక యంత్రాలతో 3గంటలపాటు శ్రమించి మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. థియేటర్ పూర్తిగా దగ్ధం
ఇదీ చదవండి:Man Suicide in Krishna district: కృష్ణా జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య