No mask: కస్టమ్ డ్యూటీ చెల్లించక దిల్లీలోనే మాస్కులు
14:41 September 24
VJA_Delhi_Rs 6 lakh Custumduty no payment_Breaking
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం రూ.3లక్షల కస్టమ్ డ్యూటీ చెల్లించకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన మాస్కులు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాయి.
అమెరికా నుంచి వచ్చిన 10 లక్షల ఎన్ 95 మాస్కులు, అలాగే కెనడా నుంచి వచ్చిన ఆక్సిజన్ కాన్సట్రేటర్లు దిల్లీ విమానాశ్రయంలోనే ఉన్నాయి. దిల్లీ నుంచి వాటిని తీసుకువచ్చేందుకు మరో రూ.2 లక్షల వరకూ వ్యయం అయ్యే అవకాశముంది. అయితే దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు మాత్రం తమ వద్ద నిధుల్లేవని అంటున్నారు. దీంతో కొవిడ్ సాయంగా అందాల్సిన సామగ్రి విమానాశ్రయంలోనే మగ్గుతున్నాయి.
ఇదీ చదవండి:EX MP HARSHA: జగన్ జోక్యం చేసుకున్నా న్యాయం చేయడం లేదు: మాజీ ఎంపీ హర్షకుమార్