విజయవాడలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. కృష్ణలంకలో స్రవంతి అనే మహిళ అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. సోదరుని పెళ్లి షాపింగ్‌కు వస్తానని తల్లితో చెప్పి... ఉదయానికి ఆత్మహత్య చేసుకోవడం అనుమానానికి తావిస్తోంది. డబ్బు కోసం భర్తే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది.
షాపింగ్‌కు వస్తానని చెప్పింది.... ఇంతలోనే... - sucide
విజయవాడలో వివాహిత ఆత్మహత్య అనుమానాస్పదంగా మారింది . కృష్ణలంకలో స్రవంతి అనే మహిళ అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. డబ్బుకోసం భర్త తారకరాం తన కుమార్తెని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది.
స్రవంతి , తారకరాం 9 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్న తారకరాం... డబ్బుకోసం స్రవంతిని నిత్యం వేధించేవాడని బంధువులు చెబుlున్నారు . కొద్దిరోజుల కిందట స్రవంతి సోదరునికి పెళ్లి కుదిరింది... ఆడపడుచు కట్నం కింద 10 లక్షల రూపాయలు కావాలని తారకరాం డిమాండ్ చేసినట్లుగా స్రవంతి తల్లి ఆరోపిస్తున్నారు. సోదరుని పెళ్లి షాపింగ్ వస్తానని చెప్పిందని... రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే స్రవంతి చనిపోయిందని చెప్పినట్లు ఆమె తెలిపారు .
భర్త తారకరాం , అత్త వేధింపులే తన కూతురు మృతికి కారణమని ... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు