ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం' - Marreddy Srinivasa Reddy comments on cm jagan

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Marreddy Srinivasa Reddy comments on cm jagan
రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం

By

Published : Jan 15, 2021, 9:26 PM IST

ముఖ్యమంత్రి జగన్‌ దుర్మార్గ పాలన వల్ల రైతులు సంక్రాంతి పండుగను సరిగ్గా జరుపుకోలేకపోయారని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం రైతులకు ఏ విధమైన ప్రోత్సాహం అందడం లేదని ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కర్నూలు జిల్లా మడకశిరలో రైతు.. సంక్రాంతి రోజు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి రావడం దారుణమని ఆక్షేపించారు. ప్రభుత్వం మీద నమ్మకం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే వ్యవసాయ రంగ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details