రైతులకు మేలు చేకూరేలా ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది..? ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, రైతులకు ఎంత డబ్బు చెల్లించారో చెప్పగలరా? అని నిలదీశారు. రైతులు తమ పొలాలను కాపాడుకోవటానికి సొంత సొమ్ముతో కాలువల్ని బాగు చేసుకునే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలతో రైతుల జీవితాలు మారిపోయాయని ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పచ్చి అబద్ధమన్నారు. ఆర్బీకేల్లోని వసతులు, అక్కడ లభించే వ్యవసాయ పరికరాలు, ఇతరత్రా సౌకర్యాలపై బహిరంగ చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు.
ఆర్బీకేల్లో వసతులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?: మర్రెడ్డి - ప్రభుత్వంపై మర్రెడ్డి కామెంట్స్
రైతు భరోసా కేంద్రాల్లో వసతులు, అక్కడ లభించే వ్యవసాయ పరికరాలు, ఇతరత్రా సౌకర్యాలపై బహిరంగ చర్చకు సిద్దమా? అని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులకు మేలు చేకూరేలా ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్బీకేల్లో వసతులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?