రైతులకు వైకాపా ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరివ్వలేదని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పిస్తూ రైతులకు ఏదో చేస్తున్నట్లుగా సజ్జల నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నం పెట్టే రైతుల్ని ఆదుకోమని చంద్రబాబు కోరటం కూడా నేరమన్నట్లుగా వైకాపా నేతలు మాట్లాడుతున్నారు.
రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకున్న చంద్రబాబు పాలనకు, నిత్యం అబద్ధాలతో కాలక్షేపం చేసే జగన్కు పోలిక కుదరదని సజ్జల గ్రహించాలని హితవు పలికారు. వ్యవసాయాన్ని గాలికొదిలేసి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆక్షేపించారు. సారా కంపెనీలకు మేలు చేసేందుకు రూ.2,850కి కొనాల్సిన జొన్నను రూ.1850కే రైతుల నుంచి ప్రభుత్వం కొంటోందన్నారు.