నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో రహదారుల వెంబడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి అప్రమత్తమైన పోలీసులు... నేడు బంద్‌కు పిలుపునిచ్చిన కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అందుకు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఎదురు కాల్పులు
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరుకు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana). ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, బీజాపూర్ జిల్లా తాళ్ల గూడెం మధ్య గల అడవి ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు(maoist killed in telangana) పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల ఘటనను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ధ్రువీకరించారు.