కరోనాపై పోరుకు పలు సంస్థలు విరాళం - Mylan Laboratories Limited donation to CM relief fund
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనాపై పోరుకు పలు సంస్థలు సహాయం అందిస్తున్నాయి.
కొవిడ్-19 నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అసోసియేషన్ రూ.2కోట్లు విరాళం ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్కును అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ఉపేంద్రనాధ్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు అందజేశారు. మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇచ్చింది. ఆ సంస్థ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఏపీఐ ఆపరేషన్స్ ఏ.జ్యోతిబసు చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఏపీ ఫెర్రో అల్లాయీస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోటి ఒక లక్ష 51 వేలు విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించింది. సీఎం జగన్కు కలిసిన వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వీటన్నింటికి సంబంధించిన చెక్కులు, వివరాలను అందించారు.