ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మామిడి... మీ వద్దకే మరి..! - మామిడి రైతుల ఉపశమనానికి ఉద్యానశాఖ వినూత్న ప్రయత్నం

వేసవి కాలం వచ్చిందంటే- ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూసే పండే...మామిడి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మామిడిని ఫలరాజం అని పిలుస్తారు. అలాంటి మామిడి రైతులు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఉద్యానశాఖ, రైతు ఉత్పత్తి సంఘాలు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మామిడి తోటల్లోని కాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల చెంతకే చేరుస్తున్నాయి.

mangos-door-delivery
అపార్ట్‌మెంట్ల వద్దకే తీసుకొచ్చి మామిడికాయల విక్రయం

By

Published : Apr 18, 2020, 2:58 PM IST

అపార్ట్‌మెంట్ల వద్దకే తీసుకొచ్చి మామిడికాయల విక్రయం

పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు లేక... మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఉద్యానశాఖ... వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లాలోని రెడ్డగూడెం, నూజివీడు, ఆగిరిపల్లి, నున్న తదితర మండలాల్లోని మామిడి తోటల్లోని కాయలు, పండ్లను అపార్ట్‌మెంట్ల వద్దకే తీసుకొచ్చి విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. రసాయనాలేమీ వాడకుండా ప్రకృతి సేద్యం ద్వారా పండిన కాయలనే తీసుకొస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉంటూ మామిడి కావాలనుకునే వారు... విజయవాడ ఉద్యానశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల రైతులకు, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటుందంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details