పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉభయ రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగువారందరి సంస్థ అని... రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అలాంటి వర్సిటీని విడగొట్టడం మంచిది కాదని తెలిపారు. పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన ప్రముఖ నాట్యగురువు నిర్మలాప్రభాకర్ అభినందన సభను శనివారం యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించారు.
తెలుగు వర్సిటీని యావత్ తెలుగు జాతి సంస్థగా ఉంచాలి: మండలి - Telugu university should be kept as a Telugu national institution
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఒక రాష్ట్రానికే పరిమితం చేయొద్దని, దాన్ని విడదీయకుండా యావత్ తెలుగు జాతి సంస్థగా ఉంచాలని రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు. వర్సిటీ పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన ప్రముఖ నాట్యగురువు నిర్మలా ప్రభాకర్ అభినందన సభను శనివారం యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించారు.
‘తల్లి భాష.. తెలుగు మన శ్వాస’
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ‘తల్లి భాష.. తెలుగు మన శ్వాస’ సాహిత్య కార్యక్రమాన్ని వర్చువల్‌లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు జయశేఖర తాళ్లూరి, సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్ తోటకూర తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు. జర్మనీ ఎస్‌ఆర్‌హెచ్ వర్సిటీ ఆచార్యులు తొట్టెంపూడి గణేష్, విజయవాడ కల్చరల్ కేంద్రం ఈవో శివనాగిరెడ్డి, సాహితీవేత్త అద్దంకి శ్రీనివాస్ పాల్గొంటారు.