ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజన్న రాజ్యమని చెప్పుకునే హక్కు సీఎం జగన్​కు లేదు: మండలి బుద్ధ ప్రసాద్ - krishna district news

హిందువుల పట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి మమకారంతో వ్యవహరించేవారని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాజన్నరాజ్యమని చెప్పుకునే హక్కు సీఎం జగన్​కు లేదని విమర్శించారు. కృష్ణా జిల్లా టేకుపల్లిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి తీరును తప్పుబట్టారు.

మండలి బుద్ధ ప్రసాద్
మండలి బుద్ధ ప్రసాద్

By

Published : Sep 11, 2021, 10:41 PM IST

Updated : Sep 11, 2021, 10:49 PM IST

గణపతి నవరాత్రుల విషయంలో ప్రభుత్వ విధానాన్ని మండలి బుద్ధప్రసాద్ తప్పుపట్టారు. రాజన్న రాజ్యమని మాటలు చెబుతూ.. అయన ఆలోచనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం బాధాకరమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి దేవాలయాల పట్ల మమకారం చూపేవారని.. హిందువుల మనోభావాలు గౌరవించేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజన్న రాజ్యం అని చెప్పుకునే అర్హత లేదని మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించడం బాధాకరమన్నారు.

పూజా కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబం

కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని టేకుపల్లి గ్రామంలో జరుగుతున్న లక్ష మొదక హావన పూజా కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్కాంద పురాణంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా టేకుపల్లి గుర్తింపు పొందిందని.. అక్కడి రామేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారని పేర్కొన్నారు. ఒకనాటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం టేకుపల్లి గ్రామం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోనుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.

ఇదీ చదవండి:crime: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

Last Updated : Sep 11, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details