ఆదిలాబాద్ కిసాన్ చౌక్‌లో తన బైక్‌కు నిప్పుపెట్టిన వాహనదారుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లో తన ద్విచక్రవాహనానికి పోలీసులు తరచూ చలానాలు విధిస్తున్నారని.. ఓ వాహనదారుడు బైక్‌ను (Man sets his bike on fire Adilabad) తగలబెట్టుకున్నాడు. ద్విచక్రవాహనంపై చలాన్లు ఉండగా.. వారం క్రితం వెయ్యి రూపాయలు కట్టినట్లు వాహనాదారుడు తెలిపాడు.
తనిఖీల్లో భాగంగా అధికారులు ఇవాళ మరోసారి పరిశీలించి.. చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో కొంత డబ్బు కట్టాలని అడిగారు. వారం కిందటే చలాను కట్టానని.. మరోసారి ఎక్కడినుంచి డబ్బులు తేవాలంటూ.. వాహనదారుడు అసహనానికి గురై బైక్‌కు నిప్పుపెట్టాడు. నీళ్లు తీసుకొచ్చి మంటలార్పిన ట్రాఫిక్ పోలీసులు.. విధుల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.
గతంలో జరిగిన ఘటనలు..
- మద్యం మత్తులో.. తన ద్విచక్రవాహనంపై పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారని వాహనాన్ని తుగులబెట్టుకున్నాడో యువకుడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో జరిగింది.
- చాలా మంది వాహనదారులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం, నంబర్ ప్లేట్‌ను తీసివేయడం, తప్పుడు ప్లేట్‌ను పెట్టుకుని తిరుగుతున్నారని కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.
- నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలను నడిపిన వ్యక్తులను ఈ-చలాన్లు భయపెడుతున్నాయి. పెండింగ్ చలాన్లు(pending challans vehicle seize) ఉన్న వాహనాల్లో ప్రభుత్వ వెహికిల్స్ కూడా ఉండడం గమనార్హం. ఓ కలెక్టర్ వాహనంపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 28 చలాన్లు ఉన్నాయి.
- చాలా మంది వాహనచోదకులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం, నంబర్ ప్లేట్‌ను తీసివేయడం, తప్పుడు ప్లేట్‌ను ఉపయోగించడం, సిగ్నల్ పట్టించుకోకపోడం తదితరాలు చేస్తుండడం చూస్తున్నాం. అలా చలాన్లు కట్టకుండా తప్పించుకొని తిరురుగుతున్న ద్విచక్ర వాహన దారుడు మహ్మద్ ఫరిద్ ఖాన్ చివరికి ఇలా చిక్కాడు.
ఇదీ చదవండి:
HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!