Murder: విజయవాడ మాచవరం పోలిస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది. మొగల్‌రాజ్ పురం అమ్మ కళ్యాణ మండపం నుంచి క్రీస్తురాజు పురం వెళ్తూ దేశీ సురేశ్ అనే వ్యక్తిని కంకణాల చౌడేష్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దేశి సురేష్, కంకణాల చౌడేష్ మధ్య గత కొంత కాలం నుంచి గొడవలున్నాయని తెలిపారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Murder: కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య..! ఎక్కడంటే..? - విజయవాడ తాజా వార్తలు
Murder: విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో దేశీ సురేశ్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని మాచవరం పోలీసులు తెలిపారు.
కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య