విజయవాడలో కొందరు యువకులు కత్తులతో స్వైరవిహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం నగరం నడిబొడ్డున, దుర్గ అగ్రహారంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఆలమూరు రామారావు (32) అనే యువకుడు హతమయ్యాడు. అతన్ని మాట్లాడుకుందామంటూ పిలిచిన వ్యక్తులే కత్తులతో దాడిచేసి విచక్షణారహితంగా నరికారు. ఇందులో సస్పెక్ట్ షీట్ ఉన్న కుక్కల రవికుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
MURDER: విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య - vijayawada crime news
14:21 June 25
నడిరోడ్డుపై కత్తులతో వ్యక్తిని నరికి చంపిన దుండగులు
నమ్మకంగా పిలిచి హత్య.
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ఆంధ్రప్రభకాలనీకి చెందిన ఆలమూరు రామారావు ఆర్‌ఎంపీగా పని చేస్తున్నారు. ఇటీవల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొవిడ్ విధుల్లో కూడా పాలు పంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫోన్ రావడంతో రామారావు దుర్గ అగ్రహారంలోని డాక్టర్ అచ్చమాంబ వీధికి వచ్చారు. అప్పటికే అక్కడ ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తన ద్విచక్ర వాహనంపై ఉన్న రామారావుపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతను బండి వదిలి అక్కడి నుంచి పారిపోతుండగా వెంటపడి కత్తులతో నరికారు. రామారావు మెడ, ముఖంపై తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్యకు సంబంధించిన సమాచారం రాగానే సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఒక ఆటోలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఒక యువతి ప్రేమ వివాహం విషయమై రామారావు మధ్యవర్తిగా వెళ్లారని, ఈ విషయమై ప్రధాన నిందితుడైన రవికుమార్‌తో గొడవలే హత్యకు కారణమని భావిస్తున్నారు.
ఇదీచదవండి.