ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Suicide: కంటి చూపు పోయిందని.. వ్యక్తి ఆత్మహత్య - Suicide with Blank Fungus

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​ పరిధిలో ఓ వ్యక్తి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లాక్ ఫంగస్ సోకి చూపు కోల్పోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

కంటి చూపు పోయిందని...వ్యక్తి ఆత్మహత్య
కంటి చూపు పోయిందని...వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jan 16, 2022, 1:54 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​ పరిధిలో ఓ వ్యక్తి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమవతిపేట్​కు చెందిన ఓ వ్యక్తికి కొన్నిరోజుల క్రితం బ్లాక్​ఫంగస్ సోకింది. దీంతో అతను చూపు కోల్పోయాడు. అప్పటినుంచి అతను తీవ్ర మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా అతను ఆ బాధను జయించలేకపోయాడు.

దీంతో తీవ్రమనస్తాపంతో.. పురుగులమందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details