దొంగ బిల్లులు సృష్టిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్‌ను విశాఖపట్నం జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వ్యాపారులకు రూ.30 కోట్లు దొంగ బిల్లులు సృష్టించినట్లు గుర్తించారు. ఏడున్నర కోట్ల రూపాయిల మేరకు ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు అధికారులు తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, జాయింట్ డైరెక్టర్ మయాంక్ శర్మ వెల్లడించారు.
నకిలీ జీఎస్టీ బిల్లులతో టోకరా.. వ్యక్తి అరెస్ట్ - fake gst bills at ap updates
విశాఖలో దొంగ బిల్లులు సృష్టిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్‌ను అధికారులు గుర్తించారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న 14 ఇన్ఫ్రా కంపెనీల పేరిట దొంగ బిల్లులు వారికి కూడా తెలియకుండా సృష్టించినట్టు అధికారులు గుర్తించారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఇటువంటి మోసాలపై దృష్టి పెట్టిందని మయాంక్ శర్మ తెలిపారు. ఒక్క నవంబర్ నెలలోనే 11 కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. 58 నకిలీ సంస్ధలను జీఎస్టీ రిఫండ్ కోసం సృష్టించినట్టు గుర్తించామని.. రూ.440 కోట్ల వ్యాపారానికి గాను రూ.38 కోట్ల మేర జీఎస్టీ లబ్ధి పొందినట్లు రుజువైందన్నారు. ఈ కేసుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు మయాంక్ శర్మ చెప్పారు.
ఇదీ చదవండి: ప్రజా సమస్యల్ని ప్రస్తావించటంలో తెదేపా విఫలం: బొత్స