సీపీఎస్ గురించి ప్రస్తావించిన ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీపై వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాన్సెన్స్ మాట్లాడొద్దంటూ దుర్భాషలాడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో ఈ నెల 22వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో మల్లాది విష్ణు తోటి ప్రజాప్రతినిధిపై తీవ్రస్థాయిలో ధూషణలకు దిగిన వీడియో వైరల్ గా మారింది. మల్లాది విష్ణు ప్రసంగిస్తున్న సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సీపీఎస్ గురించి ప్రస్తావించినప్పుడు ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది.
నాన్సెన్స్ మాట్లాడొద్దు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీపై వైకాపా ఎమ్మెల్యే ఫైర్ - ఎమ్మెల్సీపై మల్లాది విష్ణు పైర్
అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. అతనితో పాటే తోటి ప్రజాప్రతినిధులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో ఓ ఎమ్మెల్సీ సీపీఎస్ గురించి ప్రస్తావించారు. దీనిపై ఆ ఎమ్మెల్యేకు కోపం తన్నుకొచ్చింది. నాన్సెన్స్ మాట్లాడొద్దు .. మీ వల్ల ఏమవుతుంది? అంటూ సదరు ఆ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.
malladi vishnu fires on mlc