తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూముల వేలం ప్రక్రియపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. 2015లో అధికారంలో ఉన్న తేదేపా తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేస్తుంటే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాని భాజపాకు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేవాలయ భూముల పరిరక్షణ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేవాలయానికి చెందిన భూములు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు.