రాష్ట్రంలో తెదేపా, భాజపాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే రెండు పార్టీలూ కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు, సునీల్ దేవధర్లు కుట్రలు చేయటం, ప్రజలు రెచ్చగొట్టటంలో సిద్ధహస్తులని మండిపడ్డారు. తెర వెనుక చేసే విద్రోహ చర్యలు, కుట్రలను ఆపాలని తెదేపా, భాజాపా నేతలను ఆయన డిమాండ్ చేశారు. ఉద్దేశ పూర్వకంగా కుట్రలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
'తెదేపా, భాజపాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి' - తెదేపా, భాజాపాపై మల్లాది విష్ణు కామెంట్స్
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే తెదేపా, భాజపా పార్టీలూ కుట్రలు చేస్తున్నాయని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రెండు పార్టీల నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
!['తెదేపా, భాజపాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి' 'తెదేపా, భాజపాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10159013-491-10159013-1610039288151.jpg)
'తెదేపా, భాజపాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి'