స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము పోరుకు సిద్ధమని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పని చేసే ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం తమదని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ రాజ్యంగ బద్ధంగా పని చేయటం లేదన్నారు.
ప్రభుత్వ అభిప్రాయాలు పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, పోలీసులు, క్షేత్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని... ఈ సమయంలో ఎన్నికలకు వెళ్ళాలనే ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.