ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం మత్తులో నర్స్ హల్​చల్​.. చివరకు ఏమైందంటే..? - విజయవాడ తాజా వార్తలు

Male nurse hulchal at vijayawada govt hospital: మద్యం మత్తులో ఉన్న ఓ మేల్ నర్స్.. అసుపత్రిలో హల్​చల్ చేశాడు. తనకు నచ్చినప్పుడు ఉద్యోగానికి వస్తానంటూ.. తోటి నర్సులతో వాదనకు దిగాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Male nurse hulchal at vijayawada govt hospital
మద్యం మత్తులో మేల్​ నర్స్​ హల్​చల్​

By

Published : May 27, 2022, 5:15 PM IST

మద్యం మత్తులో మేల్​ నర్స్​ హల్​చల్​.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మేల్ నర్సు మద్యం మత్తులో హల్ చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యం అనే వ్యక్తి తాత్కాలిక పద్ధతిలో కొంతకాలంగా నర్సుగా పనిచేస్తున్నాడు. అయితే.. కొన్నిరోజులుగా ఎలాంటి సమాచారం లేకుండా ఆస్పత్రికి రాకపోవడంతో అధికారులు పిలిపించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఆస్పత్రికి వచ్చిన సుబ్రమణ్యం.. రెచ్చిపోయాడు. తోటి నర్సులతో వాదనకు దిగాడు. తనకు నచ్చినపుడు విధులకు హాజరవుతునానంటూ కేకలు వేశాడు. దీంతో సుబ్రమణ్యాన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు తమకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని.. వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details