విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా నాయకత్వం.. తమకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటూ.. మాలమహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సామాజిక వర్గం పట్ల వైకాపా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రాన్సిస్ రాజు ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలంటూ.. ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేసి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.
'ఒక్క టికెట్ అయినా ఇవ్వరా? వైకాపాను ఓడించాలని జనాన్ని కోరతాం' - మాల మహానాడు అధ్యక్షుడు ఫ్రాన్సిస్ రాజు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా నాయకత్వం.. తమ సామాజిక వర్గానికి ఒక్క టిక్కెట్టు కూడా కేటాయించలేదంటూ.. మాల మహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతి ఇల్లూ తిరుగుతూ తమ సత్తా చాటుతామని హెచ్చరించింది.

'మా సామాజిక వర్గానికి ఒక్క టిక్కెట్లు కూడా కేటాయించలేదు'