Mahanadu: ఒంగోలులో జరిగే తెలుగుదేశం మహానాడుకు ఉదయం నుంచే కార్యకర్తల సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సభా ప్రాంగణం ముందు వరుసలో కూర్చునేందుకు శ్రేణులు పోటీపడుతున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో తెలుగుదేశం మహానాడు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఫొటో ప్రదర్శన, రక్తదాన శిబిరాల్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 నుంచి వేదికపై కార్యక్రమాలు మొదలు అవుతాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, జెండా ఆవిష్కరణ కార్యక్రమం, మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం వుండనున్నాయి. ఉదయం 11.45 కి చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు. తర్వాత తీర్మానాలపై చర్చ జరుగుతుంది. రాత్రి 8 గంటలకు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం ఇస్తారు. రేపు ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం ఘనంగా నివాళులర్పిoచనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించనున్నారు. మండువారిపాలెం రేపు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Mahanadu: కార్యకర్తల్లో మొదలైన "మహానాడు" జోరు.. - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
Mahanadu: మహానాడుకు ఉదయం నుంచే కార్యకర్తల సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.
కార్యకర్తల్లో మొదలైన "మహానాడు" జోరు..