బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగస్టు 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఉత్తరాంధ్రాలో ఆగస్టు 3 నుంచి 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 4, 5 తేదీల్లో దక్షిణ కోస్తా, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందని... 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడుతుంటాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది. ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈదురు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని... గంటకు 50- 70 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపింది. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది.