కొనసాగుతున్న అల్పపీడనం...రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు - వర్షాల తాజా న్యూస్
అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సహా ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఒడిశాలోని దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.
కొనసాగుతున్న అల్పపీడనం...రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు
By
Published : Sep 21, 2020, 7:59 PM IST
ఒడిశాలోని దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సహా ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ భారతావనిపై రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండటంతో ఒడిశా, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.