బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనిస్తుందని వెల్లడించారు. నేడు నైరుతి రుతుపవనాలు దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలు, మధ్య బంగాళాఖాతం మిగిలిన భాగాలు, ఉత్తర బంగాళాఖాతంలోని చాలా భాగాలలోకి ప్రవేశించాయన్నారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణ సూచన ఈ విధంగా ఉంటుందన్నారు.
Weather Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ! - అల్పపీడన వార్తలు
బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం
15:03 June 10
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉత్తర కోస్తాంధ్ర, యానాం:
- ఇవాళ , రేపు(శుక్రవారం), ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఎల్లుండి (శనివారం) ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర:
- ఇవాళ, రేపు (శుక్రవారం),ఎల్లుండి (శనివారం) దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
- ఈరోజు,రేపు (శుక్రవారం), ఎల్లుండి (శనివారం) రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఇదీచదవండి: curfew extended: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!
Last Updated : Jun 10, 2021, 3:59 PM IST