ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అల్పపీడన ప్రభావం.. రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు - ఏపీలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు

ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

low pressure effect on ap state
అల్పపీడన ప్రభావం.. రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు

By

Published : Oct 9, 2020, 3:39 PM IST

ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈనెల 11వ తేదీలోగా తీరం దాటే అవకాశముందని చెప్పింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 11న రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details