ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

lovers suicide: టీనేజర్ల ప్రేమ కథ విషాదాంతం - ప్రేమజంట ఆత్మహత్య

ప్రియురాలి బలవన్మరణానికి తానే కారణమన్న బాధ ఓ వైపు.. పంచాయితీలో కుటుంబ పరువు పోయిందన్న వ్యథ మరో వైపు.. ఎంత ఆలోచించినా బతికి లాభం లేదనుకున్నాడా యువకుడు. అంతే ఇంట్లో ఎవరూలేని సమయం చేసి ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు.

టీనేజర్ల ప్రేమ కథ విషాదాంతం
టీనేజర్ల ప్రేమ కథ విషాదాంతం

By

Published : Aug 16, 2021, 9:40 AM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు తన పెదనాన్న ఇంట్లో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆ యువకుడు.. అతడి గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లికి బాలిక తల్లిదండ్రులు నిరాకరించారు.

నేను చనిపోతున్నా.. నువ్వూ చచ్చిపో..

నెల రోజుల క్రితం యువకుడు తాను పురుగు మందు తాగుతున్నానని పేర్కొంటూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ప్రియురాలికి పంపాడు. అది చూసి బాలిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. బాలిక మృతిపై ఫిర్యాదు లేకపోవటంతో కేసు నమోదు కాలేదు. ఈ ఘటన జరిగిన రోజే అతణ్ని తల్లిదండ్రులు పక్కమండలంలో ఉన్న పెదనాన్న ఇంటికి పంపారు. కొద్ది రోజుల తరువాత అతడు బాలికకు పంపిన వీడియో వెలుగుచూసింది. తల్లిదండ్రులు పంచాయితీ పెట్టారు. రూ.13 లక్షలు జరిమానా కట్టాలని పెద్ద మనుషులు తేల్చారు. యువకుడి తండ్రి రూ.లక్ష చెల్లించి మిగతా మొత్తానికి నోటు రాసిచ్చారు.

అంతా నా వల్లే జరిగింది..

3 రోజుల క్రితం యువకుడు సొంతింటికి వెళ్లగా పంచాయితీ గురించి తెలిసింది. ఆదివారం తిరిగి పెదనాన్న ఇంటికి వచ్చి అంతా తన వల్లే జరిగిందనే మనస్తాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని బంధువులు ద్విచక్ర వాహనంపై సొంతూరికి తరలించే క్రమంలో విషయం పోలీసులకు తెలిసింది. వాహనాన్ని వెంబడించారు. మృతదేహాన్ని ఇల్లెందు తరలించారు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:Murder: పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

ABOUT THE AUTHOR

...view details