నిబంధనలు సడలించినా... రోడ్లపైకి రావేలా? - విజయవాడలో లాక్ డౌన్
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన వేళ.. సరకు రవాణాకు అనుమతులు లభించినా.. విజయవాడలో లారీలు రోడ్లపైకి రాలేని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ వల్ల లారీలు నెలలు తరబడి గ్యారేజీకే పరిమితమయ్యాయని..చిన్నపాటి మరమ్మతులు చేసేవారు కూడా అందుబాటులో లేరని లారీ యజమానులు ఆవేదన చెందుతున్నారు. నగరం రెడ్ జోన్ లో పరిధిలో ఉండడం...లారీలకు అనుబంధంగా పనిచేసే రంగాలు అందుబాటులో లేకపోవడంతో...తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న లారీల యజమానులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
లాక్ డౌన్లో లారీల ఇబ్బందులు