గ్రూప్-1 మెయిన్స్ వాల్యుయేషన్‌పై జోక్యం చేసుకోవాలని కోరుతూ... గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ(appsc) పరిణామాలపై దృష్టి సారించాలని.. న్యాయ విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞుప్తి చేశారు. డిజిటల్ వాల్యుయేషన్ అనేక విమర్శలకు తావిస్తోందని.. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
Lokesh letter to governor: ఏపీపీఎస్సీ పరిణామాలపై దృష్టి సారించండి..గవర్నర్‌ను కోరిన లోకేశ్ - appsc
ఏపీపీఎస్సీ(appsc) పరిణామాలపై దృష్టి సారించాలని గవర్నర్ బిశ్వభూషణ్(biswabhushan) ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు.
గవర్నర్‌కు లోకేశ్ లేఖ