LOKESH TWEET: ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని.. సీఎం జగన్ ప్రకటించగలరా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ చేశారు. కేంద్రం మెడలు వంచుతారా లేదంటే కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డే తల దించుతారా అని నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే వైకాపా మద్దతు తప్పనిసరని.. విజయసాయిరెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా తెస్తారనే నమ్మకంతోనే వైకాపాకు 22 ఎంపీ సీట్లు ఇచ్చారని లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు..ప్రత్యేక హోదాపై జగన్ చేసిన ప్రసంగాల వీడియోల్ని లోకేష్ ట్వీట్ చేశారు.
'కేంద్రం మెడ వంచుతారా?.. కేసుల మాఫీ కోసం తల దించుతారా?: లోకేశ్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
LOKESH TWEET: ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని.. సీఎం జగన్ ప్రకటించగలరా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ చేశారు. ప్రత్యేకహోదా తెస్తారనే నమ్మకంతోనే వైకాపాకు 22 ఎంపీ సీట్లు ఇచ్చారని లోకేశ్ స్పష్టం చేశారు.
LOKESH TWEET