కుంభకోణం చేసిన వాళ్లను వదిలేసి... దానిని బయటపెట్టిన వాళ్లని జైలులో వేయడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌తో భారీగా ఆదా చేశామని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం... 108 వాహనాల వ్యవహారంలో ప్రజాధనం ఎందుకు వృథా అయ్యిందో చెప్పలేక తెదేపా నాయకులను అరెస్టు చేయాలనుకుంటుందని విమర్శించారు.
జగన్ ప్రయత్నం ఫలించదు: నారా లోకేశ్ - 'స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వేస్తారా?'
వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 108లో ప్రజాధనం ఎందుకు వృథా అయ్యిందో చెప్పలేకే తెదేపా నాయకులను అరెస్టు చెయ్యాలనుకుంటోందని విమర్శించారు. వైకాపా నేతల ఆగడాలు బయటకు రాకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
'స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వేస్తారా?'
తెదేపా నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులతో వైకాపా నేతల భూమి, ఇసుక, గనులు, మద్యం మాఫియాల ఆగడాలు బయటకు రాకుండా చెయ్యాలనే జగన్ ప్రయత్నం ఫలించదని లోకేశ్ వ్యాఖ్యానించారు.