జనసేన శాసనసభ్యుడిని పోలీసులు అరెస్టు చేయడాన్ని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు. 'పత్రికా విలేకరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం... మలికిపురం ఘటనలో ప్రజల తరఫున ప్రశ్నించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేసింది. అంటే ఏమిటి? అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం?' అని ప్రశ్నిస్తూ ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ప్రజల తరఫున మాట్లాడితే అరెస్టు చేస్తారా?: లోకేశ్ - తెదేపా
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. ట్విటర్లో ప్రశ్నల వర్షం కురిపించారు.
lokesh_tweet_about_jagan_govt