ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nara Lokesh: వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతల​ నివాళులు - వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నారా లోకేష్ నివాళులు

Lokesh: గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు ఆర్పించారు. ప్రతిసారి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమం.. ఈసారి ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో.. లోకేశ్​ నేతృత్వంలో నిర్వహించారు.

lokesh tribute to ntr statue at venkatapalem in guntur as assembly is going to start from today
వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నారా లోకేష్ నివాళులు

By

Published : Mar 7, 2022, 11:33 AM IST

వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నారా లోకేష్ నివాళులు

Lokesh: గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు ఆర్పించారు. అమరావతి మహిళలు లోకేశ్​కు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభం రోజు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శాసనసభ పక్షం నివాళులర్పించడం అనవాయితీగా వస్తుంది. ప్రతిసారి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమం.. ఈసారి ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో.. లోకేశ్​ నేతృత్వంలో నిర్వహించారు.

ప్రతిపక్షానికి మైక్ ఇవ్వరాదని అధికారపక్షం భావిస్తే..

ప్రజాసమస్యల పరిష్కారానికి ఎన్నో అవమానాలు తట్టుకుని అసెంబ్లీకి వెళ్తున్నామని.. తెదేపా నేత అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వరాదని అధికారపక్షం భావిస్తే.. తాము చట్టసభలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పైకి అన్ని సమస్యలూ చర్చిద్దామని చెబుతూనే.. ఏ అంశమూ చర్చకు రాకుండా చేయడం గత మూడేళ్లుగా ప్రభుత్వానికి అలవాటైపోయిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీని వేదికగా మలుచుకుంటామని.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

ఇదీ చదవండి:

బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా టిడ్కో ఇళ్లు ఉచితంగా అందజేయాలి: నిమ్మల రామానాయుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details