రాష్ట్ర విభజన నాటి పరిణామాలు, అమరావతి నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన అడుగులు, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పిట్టకథ రూపంలో పంతగాని నరసింహ ప్రసాద్ వివరించారు. అమరావతి రాష్ట్ర ప్రజల మనోభావాల జోలికెళ్తే ఎంతటివారైనా మసేనని లోకేశ్ ట్విట్టర్లో హెచ్చరించారు. చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమరావతితో ఆటలాడుతున్న మూర్ఖుడు జగన్ రెడ్డని దుయ్యబట్టారు.
అమరావతికి ఏమైందీ? పాట విడుదల చేసిన లోకేశ్ - అమరావతిపై పంతగాని నరసింహ ప్రసాద్ పాట
అమరావతికి ఏమైందీ అంటూ తెదేపా సాంస్కృతిక విభాగం రూపొందించిన ఓ పాటను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో విడుదల చేశారు. కృష్ణమ్మ సాక్షిగా, దుర్గమ్మ వాకిట నిలిచిన అమరావతి రాక కోసం కలలు ఏమయ్యాయంటూ సాగిన ఈ పాటను సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ రూపొందించారు.
అమరావతికి ఏమైందీ? పాట విడుదల చేసిన లోకేశ్
అమరావతి గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ నరసింహ ప్రసాద్ రూపొందించిన పాట విన్న తరువాత అమరావతిపై గౌరవం మరింత పెరుగుతుందన్నారు. అమరావతి చరిత్ర, ఉద్యమ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు పాటని రూపొందించారని లోకేశ్ అభినందించారు.