LOKESH: ఇటీవల మంగళగిరి నియోజకవర్గం తుమ్మపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. తిరుపతమ్మ కుమార్తె పేరున రూ.3 లక్షలు, కుమారుడు వరుణ్ సాయి పేరు మీద రూ.2 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. పిల్లలు ఇద్దరూ బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా అన్నగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
హత్యాచారానికి గురైన కుటుంబానికి.. లోకేశ్ ఆర్థికసాయం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
LOKESH: ఇటీవల తుమ్మపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆర్ధిక సాయం అందించారు. తిరుపతమ్మ కుమార్తె, కుమారుడు పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
తుమ్మపూడిలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి లోకేశ్ ఆర్థికసాయం
తుమ్మపూడిలో తిరుపతమ్మ మృగాళ్ల చేతిలో హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.. అదే రోజు తిరుపతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన లోకేశ్ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చెయ్యడంతోపాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట దుగ్గిరాల మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: