సొంత చెల్లినే ఒంటరిని చేసిన ముఖ్యమంత్రి జగన్..రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించి ఆదుకుంటాడనుకోవటం కలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. కన్నీళ్లు తుడిచే అన్నగా ఉంటానని చెల్లెమ్మలకు జగన్ రెడ్డి హామీ ఇస్తే.., మహిళలపై వైకాపా నాయకులు లెక్కలేనని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామ సచివాలయంలో మహిళా వెల్ఫేర్ అసిస్టెంట్‌పై వైకాపా నేత దుర్భాషలాడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి చెప్పిన 21 పని దినాల్లో 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రమ్య హంతకుడికి ఉరి ఎప్పుడని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసా ఇవ్వగలరా అని ప్రశ్నించారు.