ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: లోకేశ్​ - Lokesh on Ruia hospital incident

Lokesh on Ruia Incident: తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ చేతకాని పాలన కారణంగా అనారోగ్యంతో మరణించిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.

Lokesh on Ruia hospital incident
Lokesh on Ruia hospital incident

By

Published : Apr 26, 2022, 1:51 PM IST

Lokesh on Ruia Incident :తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విట్టర్ లో విమర్శించారు. జగన్‌ చేతకాని పాలన కారణంగా అనారోగ్యంతో మరణించిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తెదేపా హయాంలో పార్థివదేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందని లోకేశ్‌ గుర్తుచేశారు. మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చేయడం కారణంగానే ప్రైవేటు అంబులెన్సుల దందా పెరిగిందన్నారు. ప్రైవేటు అంబులెన్సుల ధరలు తట్టుకోలేకే ఆ తండ్రికి బైక్‌పై తీసుకెళ్లాల్సిన కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ఆసుపత్రుల్లో అవమానవీయ ఘటనలు చోటు చేసుంటున్నాయని అన్నారు. మొన్న విజయవాడ ఆసుపత్రిలో యువతిపై సాముహిక అత్యాచారం.... నేడు రుయా ఘటన ఇకనైన సీఎం జగన్‌ నిద్రలేచి ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరచాలన్నారు.

ఇదీ చదవండి :తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details