ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు' - జర్నలిస్ట్ శివప్రసాద్ అరెస్ట్ న్యూస్

ముఖ్యమంత్రి జగన్‌ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే.. అక్కసుతో జర్నలిస్ట్​ శివ ప్రసాద్​ను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు.

lokesh on journalist arrest
lokesh on journalist arrest

By

Published : Sep 2, 2020, 7:00 PM IST

తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, నోటీసులివ్వకుండా జర్నలిస్ట్ శివ ప్రసాద్​ను అరెస్టు చేశారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జర్నలిస్ట్​ అక్రమ అరెస్టుని తెలంగాణ హై కోర్టు సుమోటోగా స్వీకరించిందని తెలిపారు. జరిగిన ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు శివప్రసాద్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారని చెప్పారు. జగన్​ను మెప్పించేందుకు సీఐడీ తప్పుల మీద తప్పులు చేస్తుందని విమర్శించారు. చేస్తున్న తప్పులకు వైకాపా నాయకులు, వారు చెప్పినట్టు ఆడి.. అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details