Lokesh on DSP Promotions : తెదేపా ప్రభుత్వ హయాంలో 35 మంది కమ్మ సామాజిక వర్గం డీఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారంటూ నాటి ప్రతిపక్ష నేత జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుందని పేర్కొన్నారు. నాడు జగన్ కులం పేరుతో చంద్రబాబుపై బురద జల్లాడని మండిపడ్డారు.
అబద్ధానికి మానవ రూపం జగన్ రెడ్డి : లోకేశ్ - nara lokesh updates
Lokesh on DSP Promotions : సీఎం జగన్పై నారా లోకేశ్ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయంలో 35 మంది కమ్మ డీఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారంటూ.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. డీఎస్పీల పదోన్నతులపై నాటి ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు, తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం వివరాలను లోకేష్ తన ట్విట్టర్ పోస్టుకు జత చేశారు.
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా.. పదోన్నతులన్నీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వలేదని.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకూ ఇచ్చారని లిఖిత పూర్వకంగా నిజాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా.. అబద్ధానికి మానవ రూపం జగన్ రెడ్డి అని మరోసారి రుజువైందని లోకేశ్ దుయ్యబట్టారు. డీఎస్పీల పదోన్నతులపై నాటి ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు, తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం వివరాలను లోకేశ్ తన ట్విట్టర్ పోస్టుకు జత చేశారు.
ఇదీ చదవండి :nara lokesh : 'విమర్శలు మాని.. అభివృద్ధి చేయాలి'