ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భాగ్యనగరంలో ప్రజలు బయటకు రావొద్దు' - Heavy rains in Hyderabad news

భాగ్యనగరంలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలు బయటకు రావద్దని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​‌కుమార్‌ సూచించారు.

'భాగ్యనగరంలో ప్రజలు బయటకు రావొద్దు'
'భాగ్యనగరంలో ప్రజలు బయటకు రావొద్దు'

By

Published : Oct 14, 2020, 10:35 AM IST

హైదరాబాద్​లో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలు బయటకు రావద్దని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​‌కుమార్‌ సూచించారు. వర్షాలతో నగరంలోని పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరదముంపునకు గురయ్యాయని ఆయన తెలిపారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక బృందాలతో రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని కమిషనర్​ అన్నారు. కావునా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, కొండవాలు ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలన్నారు. ఎటువంటి ఆసరా లేని వారికి కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details