రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా అరాచకాలను ఆధారాలతో సహా బయటపెట్టి.. అక్రమార్కులను ఊచలు లెక్కపెట్టిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయన్నారు. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోందన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ రెడ్డి బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ధ్వజమెత్తారు. గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉందని హెచ్చరించారు. బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కు సహకరించిన అధికారులు కూడా ఈ సారి జైలు శిక్ష ఖాయమన్నారు.
Lokesh: వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి: నారా లోకేశ్ - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వార్తలు
వైకాపా మైనింగ్ మాఫియా అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడతామని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ రెడ్డి బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ధ్వజమెత్తారు.
వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి: నారా లోకేశ్